అక్కడ గోల్డ్ రేట్ ఎంతో తక్కువ..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విక్రయించే శ్రీవారి బంగారు డాలర్లు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. 10 గ్రాముల బంగారు డాలర్‌ను టీటీడీ వద్ద కొనుగోలు చేయడం ద్వారా రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. టీటీడీ 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లను అలాగే వెండి, రాగి డాలర్లను కూడా విక్రయిస్తుంది. బంగారు ధర ప్రతి బుధవారం మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది.