కారులో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన 9 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వరదలో కొట్టుకుపోతున్న కారుని.. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను ట్రాక్టర్ల సహాయంతో పోలీసులు, స్థానికుల సహాయంతో కాపాడారు. కారులో ఉన్న ప్రయాణీకులు గోవిందు (35), చందు (35), బిచ్చ(33), రవి (30) రాజేంద్రప్రసాద్ (22) శ్రీకాంత్ (13) సంజన (4) కార్తీక్ (4) సంతోష్ (27)లుగా గుర్తించారు.