కన్నతల్లిని రోడ్డుపాలు చేసిన కొడుకులు..! అడ్డాల నాడు బిడ్డలు కానీ. గడ్డాల నాడు బిడ్డలు కాదని అంటారు. అదే నిజం అనిపిస్తుంది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లారు కసాయి కొడుకులు. వృద్ధురాలైన కన్నతల్లిని, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. అనాథగా వదిలేశారు కన్న కొడుకులు. ఉన్న ఆస్తి లాక్కొని, కన్నతల్లికి అన్నం పెట్టకుండా రోడ్డుపై వదిలేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.