ఇప్పటికే సింహాచలం లడ్డుప్రసాదంలో వినియోగించిన నెయ్యిపై ఎమ్మెల్యే గంట అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జంగారెడ్డి గూడానికి చెందిన రైతు డైరీ నెయ్యి శాంపిల్స్ లో సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ కు పంపించారు. అప్పటికే స్టోర్ లో స్టాక్ ఉన్న నెయ్యి డబ్బాలను సీజ్ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో సంప్రోక్షణ, శాంతి హోమాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.