మావోల భారీ కుట్ర భగ్నం.. ప్రాణాలపై గిరిజనులు ఆందోళన..

చత్తీస్గడ్ - తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీలో గ్రామాల్లో క్షణక్షణం టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. తాజాగా మావోయిస్టుల మరో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మావోయిస్టుల మందుపాతరలు అమాయక ప్రజల ప్రాణాలను మింగేస్తుండడంతో ఒకప్పుడు మావోలకు షెల్టర్ ఇచ్చిన గ్రామాల్లోనే ఇప్పుడు ప్రజా ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి.