మురికి కాల్వలో కనిపించింది చూసి జనం పరుగో పరుగు!

రాజీవ్ నగర్ కాలనీలో గురువారం(నవంబర్ 7) రాత్రి సమయంలో ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. అయితే పక్కనే కొండలు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. కాలనీలోని మురికి కాలువ నుండి పరుగులు తీసింది. సుమారుగా ఆరు ఫీట్ల వరకు పొడవు ఉన్న కొండచిలువ ఇళ్ల మధ్య కనిపించడంతో జనం భయాందోళనలు వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు పెద్ద సంఖ్య లో గుమికూడి.. వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. కానీ బయటకు రాలేదు.