ఈ కానిస్టేబుల్‌కు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే..! గుండెపోటుకు గురైన వ్యక్తికి ప్రాణం పోశాడు..

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ కానిస్టేబుల్‌.. గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు. లక్నోలో అజయ్ కుమార్ (45) అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుమార్‌కు గుండెపోటు వచ్చింది.