హైదరాబాద్ : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. సోమాజీ గూడాలోని వివేక ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంచిర్యాలలో వివేక్ నివాసంలోను ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్ ఇళ్లు, కార్యాలయాలు, అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం వివేక్ కంపెనీలో అధికారులు రూ. 8 కోట్లు సీజ్ చేశారు.