హరికేన్ తుఫాన్ అమెరికాలో మూడ్రోజులుగా బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, కరోలినా, టెనస్సీ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. తుఫాన్ ఎఫెక్టుతో ఇప్పటివరకు 105 మంది మరణించారు. ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ వద్ద గంటకు 225 కి.మీ. వేగంతో హరికేన్ తీరం దాటింది.