పాలమూరు బుర్రవీణ వాయిద్య కళాకారునికి పద్మశ్రీ.. ఆయనే చివరాఖరి వారసుడు!

పాలమూరు పల్లె బుర్రవీణ వాయిద్య కళకు ఢిల్లీ గుర్తింపు లభించింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పను పద్మశ్రీ వరించింది. అంతరించిపోతున్న ప్రాచీన సంగీత వాయిద్యం బుర్రవీణ కళకు దాసరి కొండప్ప చివరి వారసుడు. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలను లయ బద్ధంగా పాడుతూ... తన బుర్రవీణ వాయిస్తూ కొండప్ప అబ్బురపరుస్తాడు. కొండప్ప గానం వింటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా మైమరిచిపోతారు.