నేను 9 టు 6 అయినా చేయగలను.. 9 టు 9 అయినా వర్క్ చేయగలను.. కానీ 9 గం లకు చిత్రీకరణకు అందుబాటులో ఉండాలంటే నటులు, ఉదయం 5 గం లకు లేచి 7:30 కల్లా సెట్ లో ఉండాలి.. 6 గం లకు చిత్రీకరణ పూర్తయితే ఇంటికి వెళ్లటానికి 9 గంలు అవుతుంది. అదే 9 టు 9 కాల్షీట్ అయితే ఇంటికి వెళ్లటానికి రాత్రి 11 గం లు దాటెస్తుంది. ఇక వర్కౌట్ చేసి ప్రెష్ అయి నిద్రపోవటానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఏ మనిషికయినా ముఖ్యమనే ఎనిమిది గంటల నిద్ర అనేది మాకు ఎక్కడుంది.! అవసరం అనుకుంటే నేను ఎన్ని గంటలయినా నటిస్తాను. కానీ టెక్నిషియన్స్ మాకంటే ఎక్కువ సమయం సెట్ లో ఉంటారు. వారికింక రెండు మూడు గంటల నిద్రే ఉంటుంది సౌత్ లో ముఖ్యంగా తెలుగు తమిళ్ లో మనకు 8 గం వర్కే ఉంటుంది. మలయాళం, హిందీల్లో 12 గం ల కాల్షీట్ ఉంటుంది..