ఆ చెట్టే గనక లేకపోయుంటే ఎక్కడ తేలుతుండెనో... శంకునదిలో యువకుడిని కాపాడిన చెట్టు

ఆ చెట్టే గనక లేకపోయుంటే ఎక్కడ తేలుతుండెనో... శంకునదిలో యువకుడిని కాపాడిన చెట్టు భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఝార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఝార్ఖండ్‌ తూర్పు సింగ్‌భమ్‌ జిల్లాలో శంకు నదిలో ఒక యువకుడు చిక్కుకుపోయాడు. ఒక చెట్టుపై చిక్కుకుపోయిన అతన్ని సమీప గ్రామస్థులు కాపాడారు. భారీ వర్షంతో ఓ ఆశ్రమ పాఠశాల వరదనీటిలో మునిగింది. దాంతో.. 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకోగా స్థానికులు తాడు సాయంతో రక్షించారు.