బాడీ స్ప్రే వాసనతో స్కూల్ విద్యార్థులకు అస్వస్థత.. పరుగులు పెట్టిన ఉపాధ్యాయులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ముంజివరంకొట్టు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఒక్కసారి అస్వస్థత గురయ్యారు. స్కూల్ రూమ్ లోకి టెన్త్ క్లాస్ విద్యార్థి సెంటు (బాడీ స్ప్రే) కొట్టుకు రావడంతో కొద్ది సేపటికే బాడీ స్ప్రే వాసనకి ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థత గురై కింద పడిపోయారు.