కల్యాణ కట్టలో ఉద్యోగాల పేరుతో మోసం..

ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ చేరారు. దీంతో టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన గుంటూరు వాసులు... ఒక్కొక్కరు లక్ష నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ చెల్లించారు. డబ్బులు చెల్లించి నాలుగేళ్లు గడిచినా ఉద్యోగం రాలేదు. డబ్బులివ్వాలని అడిగితే నావద్ద లేవంటూ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.