గోల్డ్ షాపులే టార్గెట్ గా రెచ్చిపోతున్న కిలాడీ లేడీలను మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్ రాష్ట్ర ముఠాను మంచిర్యాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ బన్సిలాల్ వివరాలను వెల్లడించారు.