మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సుయాత్ర నాలుగో రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగింది. ఉదయం పత్తికొండ నుంచి బయలుదేరిన జగన్ ప్రచార రథం రతన మీదుగా తుగ్గలి చేరుకుంది. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన నేతలు.. తుగ్గలిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ముమ్మడివరం జనసేన ఇన్‌ఛార్జ్ పితాని బాలకృష్ణతో పాటు పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్.