దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా రాసిన 'గర్బా' పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దసరా నవరాత్రి సందర్భంగా గర్బా నృత్యంపై ప్రత్యేక పాట రాశారు..ప్రధాని మోదీ. ప్రధాని రాసిన గీతాన్ని.. గాయని పూర్వా మంత్రి ఆలపించారు.