లైంగిక వేధింపులపై పెదవి విప్పిన ప్రజ్వల్‌ రేవణ్ణ

లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ హెచ్‌డీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఎట్టకేలకు మౌనం వీడారు. ఏప్రిల్‌ 27వ తేదీన జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్‌ రేవణ్ణ ఈనెల 31వ తేదీన భారత్‌కు వస్తానని, సిట్‌ విచారణ ముందు హాజరవుతానని వెల్లడించారు.