తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలోని జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 19 మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువక ముందే అదే రూట్‌తో తాజాగా మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని కరణ్ కోట్ మండల సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.