బైకర్‌ను వెంబడించి దాడి చేసిన ఖడ్గమృగం.. షాకింగ్‌ వీడియో

అస్సాంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. మోరిగావ్‌ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఆదివారం ఓ బైకర్‌పై ఖడ్గమృగం దాడి చేసింది. ఈ ఘటనలో కమ్రూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాకు చెందిన 37 ఏళ్ల సద్దాం హుస్సేన్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.