స్మగ్లర్ల రూట్ మ్యాప్‌లో వూహించని ట్విస్ట్.. అదే కొంపముంచింది!

మహబూబాబాద్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఆంధ్ర - ఒరిస్సా సరిహద్డులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు AP16DP 1148 నెంబర్ గల కారులో హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నారు. హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారనే అనుమానంతో అడ్డదారిలో వెళ్తున్నారు.. ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్ లో ఊహించని ట్విస్ట్ ఎదురయింది.. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ మార్గంలో వెళుతున్న స్మగ్లర్ల కారు ఎక్సైజ్ సిబ్బందిని చూడగానే పరుగులు పెట్టింది.. అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించారు.. కానీ వాళ్ల తలరాత బాగలేక దొరికిపోయారు..