తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో లారీ దొంగతనం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. లారీ రికవరీ చేసిన పోలీసులు, నలుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అంతర్ రాష్ట్రాల లారీల దొంగల ముఠా గుట్టురట్టు చేసిన రాజానగరం పోలీసులు. రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి ఏపీకి వచ్చిన రాజస్థాన్ దొంగల ముఠా.. రాజమండ్రి, రాజానగరం ప్రాంతాలను దొంగతనాలకు హబ్ గా మార్చుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున రాజమండ్రి గామాన్ బ్రిడ్జ్ సమీపంలోని ఏఎన్ఆర్ కాటాలో మాటువేసి టిప్పర్ లారీని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. బాధితుడు మన్యం గణేశ్వర ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.