వియత్నాంలో MBBS చదువుతున్న 21 ఏళ్ల తెలంగాణ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మృతుడిని MBBS మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సదరు విద్యార్ధి తల్లిదండ్రులు అర్షిద్ అర్జున్, ప్రతిమ బట్టల వ్యాపారులు. మితిమీరిన వైగంతో బైక్‌పై వెళ్తు ఓ ఇంటి గోడను బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.