వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మేలు అయినా పేదలకు గుర్తుకొస్తుందా అని ప్రజలను అడిగారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రామాణాలతో విద్యను అందిస్తున్నామన్నారు. తాను తీసుకొచ్చిన సంస్కరణ వల్ల వచ్చే 15 ఏళ్లో ఈ విత్తనాలన్నీ మహావృక్షాలవుతాయని, వారి జీవితాలు బాగుపడతాయని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పేదరికం మాయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.