పంట పొలాల్లో ప్రత్యక్షమైన మొసలి.. సహజంగా కోతులను అడవుల్లో.. మొసళ్ళను సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ వరదల సమయాల్లోనూ మొసళ్ళు బయట పడుతుంటాయి. కానీ ఇటీవల కోతుల మాదిరిగానే మొసళ్ళు కూడా జన సంచారంలోకి వస్తున్నాయి. ఇపుడు కోతులతోపాటు మొసళ్ళు కూడా వ్యవసాయ పొలాల్లో దర్శనమిస్తున్నాయి. పంట చేనుల్లో దర్శనిమిచ్చిన మొసలిని మీరేప్పుడైనా చూశారా.. అలాంటి ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.