ఈ ఏడాది పూరి జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్షయ తృతీయ రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, రథం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆషాడ మాసం రెండో రోజు (జూన్ 27) నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది 12 రోజులపాటు జరుగుతుంది. సాధారణంగా హిందూ దేవాలయాలలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. అయితే పూరిలో జగన్నాథ్, బలభద్ర, సుబధ్రల మూలవిరాట్ విగ్రహాలే ప్రత్యేకంగా ఊరేగింపులో భాగంగా ఉంటాయి.