అమ్మవారి ఆలయంలో వింత శబ్ధాలు.. ఎంటాని తొంగి చూడగా హడలెత్తించే సీన్‌!

గ్రామ దేవత ఆలయం నుంచి బుసలు కొడుతూ భారీ శబ్దాలు. నిమిషాల గడుస్తున్నా శబ్దాలు ఆగటం లేదు. అమ్మవారి ఆలయం నుంచి వింత శబ్దాలు ఏంటా అని దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. చూస్తే భారీగా ఉన్న కొండచిలువ అక్కడ తిష్ట వేసి ఉంది. భారీ సైజులో ఉన్న రక్తపింజరను చూసిన స్తానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. తర్వాత మళ్ళీ తేరుకొని ఆలయంలో ఉన్న రక్తపింజరను బయటకు పంపించేందుకు తీవ్ర కసరత్తు చేశారు.ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కిలంత్ర గ్రామంలో చోటు చేసుకుంది.