అరేయ్ ఏంట్రా ఇది.. హుండీలో బొమ్మ నోట్లు..

ద్వారకాతిరుమల చిన వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దు అయిన నోట్లు భక్తులు నుంచి వస్తున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి దేవస్ధానం అధికారులు మారుస్తున్నారు. అయితే, రద్దు అయిన లేదా చెల్లని నోట్లు దేవుడికి ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా.. తాజాగా బొమ్మ నోట్ల కట్టలు దేవస్ధానం హుండీలో వెలుగుచూడటం చర్చ నీయాంశంగా మారింది.