పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది యువతీ, యువకులు

నగరంలో పబ్స్ గబ్బు లేపుతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా తమ తీరును మార్చుకోవట్లేదు పబ్ యాజమానులు. వివిధ రాష్ట్రల నుండి అమ్మాయిలను తీసుకోని వచ్చి వారిచేత అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలను ఉల్లంగిస్తూ అర్ధరాత్రుల వరకు మత్తులో మునుగుతున్నారు. తాజాగా బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 8లో ఉన్న ఆఫ్టర్నూన్ పబ్‎పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్‎తోపాటు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా రైట్స్ నిర్వహించారు.