కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య - Tv9

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనుకున్నట్లుగానే ఆదివారం బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షి, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.