PM Modi: వారణాసిలో మోదీకి అపూర్వ స్వాగతం.. అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపిన ప్రధాని..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం వారణాసి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి కాశిలో అపూర్వ స్వాగతం లభించింది. సాధువులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.. కాన్వాయ్ పై పూల వర్షం కురిపించి.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.