అధికారులకు జగ్గారెడ్డి అల్టిమేటం.. సంగారెడ్డిలో హైడ్రా అడుగుపెడితే ఖబడ్దార్ అంటున్నారు జగ్గారెడ్డి. తన నియోజకవర్గ పరిథిలోకి వస్తే.. కచ్చితంగా సమాచారం ఇవ్వాలని.. లేకుంటే తన ఆగ్రహానికి గురవతారంటున్నారు. హైడ్రా విషయంలో కొందరు అధికారులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ORR దాటి హైడ్రా కూల్చివేతలు ఉండవని సీఎం చెప్పారని గుర్తుచేశారు. సీఎం చెప్పిన విషయాన్నే రిపీట్ చేశానని చెప్పారు.