Big Tiger : నల్లమల సఫారీ రైడ్ లో పెద్దపులి ప్రత్యక్షం.. సెల్‌ఫోన్లలో బంధించిన పర్యాటకులు

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల అభయారణ్యంలో సఫారీ రైడ్‌లో ప్రయాణిస్తున్న పర్యాటకులకు పెద్దపులి కనిపించింది. ఆకస్మాత్తుగా ఓ పెద్దపులి పక్కన ఉన్న పొదల్లోంచి సఫారీ వాహనాల ముందుకు వచ్చింది. తమ ఎదురుగా పెద్దపులిని చూసిన పర్యాటకులు సఫారీ రైడ్ ఫలవంతమైందన్న సంబరం ఒకవైపు..పులిని దగ్గరగా చూడటం..అది ఎమైనా తమవైపు వస్తుందా అన్న భయం మరోవైపు మధ్య ఆశ్చర్య ఆందోళనలకు గురయ్యారు.