ఆస్తిలో వాటా ఇవ్వాలని మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి.. వీడియో వైరల్‌

ఆస్తి దగ్గర అల్లుడు, మామకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయితే ఇంట్లో కూర్చుని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి బదులు రచ్చకెక్కి నానాయాగి చేశాడా అల్లడు. పైగా అతడు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా సర్కార్ కొలువు కూడా చేస్తున్నాడు. ఆస్తిలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని షాపు వద్ద మామపై పోలీస్‌ అల్లుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లోచోటు చేసుకుంది.