మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందరన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్‌సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించ ప్రసంగించారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఎద్దేవా చేశారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం హామీల అమలు జరిగాయన్నారు.