అక్కడెలా పెట్టావ్‌ బ్రో.. హైదరాబాద్‌లో కారు బీభత్సం

నల్గొండ ఎక్స్‌ రోడ్డు వద్ద సోహైల్ వెవ్స్ హోటల్ సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటన దబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాత్రి వేళ వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి నల్గొండ ఎక్స్‌ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. కాకపోతే కారు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు.