కాణిపాకం వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాభాస అయింది. వచ్చే నెల 7 నుంచి 27 వరకు 21 రోజులపాటు కాణిపాకం గణపయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు అధికారులు. ఈ క్రమంలోనే.. వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ ఉభయదారులతో ఈవో వెంకటేష్, అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.