ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని మోదీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన మోదీకి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు.