మెట్టో స్టేషన్‌ను ముంచెత్తిన వర్షపు నీరు.. వీడియో వైరల్

అమెరికా నైరుతి రాష్ట్రాలైన న్యూయార్క్‌, న్యూజెర్సీలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. రహదారులు, రైలు మార్గాలు నీట మునిగిపోయాయి. న్యూయార్క్‌ నగరంలో కొన్ని మెట్రో సేవలు నిలిపివేయగా, మరికొన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది. మాన్‌హాటన్‌ మెట్రో స్టేషన్‌ను వర్షపు నీరు ముంచెత్తింది. కొంతమంది ప్రయాణికులు నీటిని తప్పించుకోడానికి ట్రెయిన్‌ సీట్లపై నిలబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.