దులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే రైలుకు వేలాడుతూ దొంగోడు..!

ఓ రైల్వేస్టేషన్‌లో రైలు కదిలేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక దొంగ కిటికీలోకి చేతులు పెట్టి రైల్లోని వ్యక్తి సెల్‌ఫోన్ కొట్టేయాలనుకున్నాడు. కానీ, ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండటంతో.. దొంగ చేతులను గట్టిగా పట్టుకున్నారు. అలా రైలు కిలోమీటర్ వెళ్లేవరకు కిటీకిలోంచి అతను వేలాడుతూనే ఉన్నాడు. పైగా దారి పొడవునా ప్రయాణికులు అతన్ని దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.