తరాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. స్వాతంత్ర దినోత్సవం వేళ అల్లూరి జిల్లాలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. అనారోగ్యంతో మృతిచెందిన మహిళ మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్లు డోలి మోశారు. మృతదేహానికి డోలి కట్టి భుజాలపై మోస్తూ రాళ్లు రప్పలు దాటుకుంటూ ముందుకు సాగారు ఆ గిరిజనులు. అంతటి కన్నీటి కష్టంలోనూ.. దుఃఖాన్ని దిగమింగుకుని అడుగులు వేశారు. పాలకులు అధికారుల తీరుపై ఆవేదన చెందుతూ.. తమ కష్టాలు తీరేదేన్నడూ అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు ఆ అడవి బిడ్డలు.