'ఐఫోన్‌ కోసం.. బ్లాక్‌ మెయిల్‌ చేసిన పుత్రరత్నం'

తల్లిదండ్రులు అడిగింది కొనివ్వలేదనీ.. పిల్లలు మారం చేయడం.. దాదాపు ప్రతి ఇంట్లో ఉండే సీనే. నయానో భయానో పిల్లల ఏడుపు మాన్పించి వారిని డైవర్ట్‌ చేస్టుంటారు అమ్మానాన్నలు. కానీ కొన్ని పెంకి రకాలు ఉంటాయి. ఎంత కొట్టినా.. తిట్టినా అడిగింది తెచ్చి ఇచ్చేవరకూ మొండిపట్టు వీడరు. అన్నం తినకపోవడం, స్కూల్‌కి వెళ్లకపోవడం.. వంటి నిరసనలు చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులే ఓ మెట్టు దిగి.. కన్న బిడ్డ ముఖంలో సంతోషం చూసేందుకు కొనిచ్చే స్థోమత లేకపోయినా అప్పోసప్పో చేసి బిడ్డ కళ్లల్లో ఆనందం నింపుతారు. ఈ వీక్‌ పాయింట్‌ను పట్టేసిన ఓ పెంకి కొడుకు ఎలాగైనా తాను ఆశపడింది కొనిపించాలని పెద్ద డ్రామానే ఆడాడు.