పేరుకే కిరాణం షాపు.. కానీ అసలు కథ వేరు, వీడియో చూస్తే షాక్

హైదరాబాద్ ను అడ్డగా మార్చుకొని స్మగ్లర్లు, దళారులు రెచ్చిపోతున్నారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మదకద్రవ్యాలు సప్లయ్ చేస్తూ మత్తుకు బానిసగా మార్చుతున్నారు. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతుండటంతో స్మగ్లరు కూడా రూటు మార్చుతూ యథేశ్చగా గంజాయిని సప్లయ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గంజాయిన వివిధ రూపాల్లో చేరవేస్తున్న స్మగ్లర్లు.. రూటు మార్చి చాకెట్ల రూపంలో గంజాయి చాకెట్లను సరఫరా చేస్తున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అవుతూ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. తాజాగా సిటీలో భారీస్తాయిలో గంజాయి చాకెట్లు పట్టుబడటం కలకలం రేపింది.