కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి దేశ విదేశాలనుంచి భక్తులు తరలి వస్తారు. చాలామంది భక్తులు కాలినడకన స్వామి దర్శనానికి వెళ్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు కూడా కాలినడకన వెళ్లడానికి తపిస్తారు. అయితే ఇటీవల తిరుమలకు కాలి నడకన వచ్చిన భక్తుల్లో కొందరు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాలినడకన వచ్చి శ్రీవారి దర్శించుకోవాలనుకుంటున్న భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.