ఇరాన్‌పై అమెరికా మెరుపుదాడి ప్రపంచ ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లండన్‌కు వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంకు అనుమతి రాకపోవడంతో రెండు గంటలుగా రన్‌వేపైనే నిలిచిపోయింది. సిబ్బంది యుద్ధ పరిస్థితులే కారణమని వెల్లడించగా, టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.