Watch: పోలీస్‌ల నిర్వాకం ఇదేనా ? గుట్టుగా పేకాడుతూ పట్టుబడ్డ ఖాకీలు..వీడియో వైరల్

చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే జూదం ఆడుతూ పట్టుబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసు అధికారులు జూదం ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా, సంఘటనలో ఉన్న ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఆరుగురిలో ఒకరు హెడ్ కానిస్టేబుల్ కాగా మరో ఐదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.