వార్నీ.. ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా.. కళ్లు మూసుకొని మరీ..

క్యూబ్ సెట్ చేయడం అంటే మాములు విషయం కాదు.. దానికి ఎంతో ట్యాలెంట్‌ ఏకాగ్రత కావాలి.. సాదరణ జనాలు ఈ క్యూబ్‌ను వన్‌ సైడ్‌ సెట్‌ చేయడానినికే నానా తంటాలు పడుతారు. కానీ ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం కళ్ళు మూసుకుని మరి నిమిషాల్లో దాన్ని కలిపేస్తున్నాడు నెల్లూరుకు చెందిన నోమేష్ అనే బాలుడు. ఈ బుడ్డోడు కళ్లు మూసుకొని 5 నిమిషాల 24 సెకండ్లలో క్యూబ్‌ను సెట్‌ చేసి అందిరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ పిల్లాలని ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ సైతం నోమేష్‌ను ప్రశంసించాడు.