‘హర్ ఘర్ తిరంగ’తో మహిళల జీవితాల్లో వెలుగులు.

‘హర్ ఘర్ తిరంగ’తో మహిళల జీవితాల్లో వెలుగులు. ఈసారి హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి. కీలక పరిశ్రమ భాగస్వాములు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రైల్వేలు, పౌర విమానయాన రంగం, భారత సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ప్రచారాన్ని ప్రోత్సహించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జెండాల ఉత్పత్తి, లభ్యతకు చురుకుగా సహకరిస్తున్నాయి. ఈ ప్రచారం సందర్భంగా త్రివర్ణ పతాకం, త్రివర్ణ పతాక కచేరీ, వీధినాటకం, పెయింటింగ్ పోటీలు, త్రివర్ణ పతాకం అభివృద్ధిపై ప్రదర్శన, ఫ్లాష్ మాబ్, త్రివర్ణ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్‌ను సమన్వయకర్త సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం వివరించారు.