తల్లి నిద్రిస్తుండగా పది రోజుల పసికందును ఎత్తుకెళ్లిన మహిళ.. అసలు ఏం జరిగిందంటే పది రోజుల పసికందును తల్లి నుంచి దూరం చేసింది.. స్నేహితురాలిగా ఇంటికి వచ్చి ఆమెతోనే ఉండి డెలివరీ సమయంలో సహాయం చేసి.. పది రోజుల తర్వాత తల్లి నిద్రిస్తున్న సమయంలో బిడ్డతో ఉడాయించింది ఓ ప్రబుద్ధురాలు.. తీరా నిద్రలేచి చూసే సమయానికి బిడ్డ లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో చోటుచేసుకుంది.