లక్కంటే ఇలా ఉండాలి.. టీ స్టాల్ నిర్వాహకుడికి లక్కీ డ్రాలో బార్ అండ్ రెస్టారెంట్!

అదృష్టం అంటే ఇలా ఉండాలి! హనుమకొండ బస్టాండ్ సమీపంలో టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న వల్లపు వెంకటేష్‌కు లక్కీ డ్రాలో బార్ అండ్ రెస్టారెంట్ దక్కింది. ములుగు జిల్లా కేంద్రంలోని బార్ కోసం మొత్తం 376 మంది దరఖాస్తు చేసుకోగా, రూ.లక్షతో ఒక్క దరఖాస్తు వేసిన వెంకటేష్‌ను అదృష్టం వరించింది.